Wednesday, April 25, 2012


రెండు చినుకుల మద్య....

విరిగి పడుతున్న మెరుపు ముక్కల్ని ఒక్కొక్కటిగా ఏరుకుంటూ
చొక్కా జేబులో వేసుకుంటున్నాను.
చిక్కగా పరుచుకున్న చీకటి కంబళిపై
తళతళా మెరుస్తున్నాయవి.
రెండు గుప్పిళ్ళూ సరిపోనంత పెద్దవి.
తేరిపార చూసాను వాటిని-
అవి....
'ఆమె' వదలి వెళ్ళిన అనుభవాల ముక్కలు-
జ్ఞాపకాల ’బిందు’వులు.
విసురుగా పడుతున్న వర్షపు చినుకుల్లో
రెండు చినుకుల మద్యగా నడుస్తున్నాను-
వర్షంలో తడవకుండా!
కానీ....
అప్పటికే తడిసిపోయాను-
'ఆమె'  జ్ఞాపకాల తుఫానులో!!
- పొ. స .సు .పవన్ గణేష్.
                             ఆం.ప్ర- 9247524379

2 comments:

♛ ప్రిన్స్ ♛ said...

nice

బాలకృష్ణా రెడ్డి said...

రెండు చినుకుల మధ్య నడుస్తున్నాను
తడిసిపోయాను జ్ఞాపకాల తుఫానులో '
ఎంత అందమైన భావనలో
'ముక్కలు' అనే పదం అతకలేదు
శకలాలు' 'తునకలు ...ప్రయత్నించండి
కవిత బాగుంది