Tuesday, January 12, 2010

సంక్రాంతి

బుజ్జాయిలకు భోగి పళ్ళు
ముగ్గులతో అలరారే వాకిళ్ళు
గంగిరెద్దుల సందళ్ళు
గొబ్బెమ్మల ముంగిళ్ళు

అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు
తాతమ్మ చేసిన బెల్లం జీళ్ళు
బావల్ని ఆటపట్టించే మరదళ్ళు
పట్టు ఓణీలతో గిలిగింతలు పెట్టే వాలు కళ్ళు

కమ్మని నేతి అరిసెలు
ఘుమ్మనే పూర్ణం బూరెలు
అక్షయ పాత్రల హరిదాసులు
పసుపు బొట్టు పెట్టిన కొత్త బట్టలు

వెచ్చని భోగి మంటలు
ఆల మందల అలంకరణలు
కొత్త బియ్యం చక్కిలాలు
గారెల ఘుమఘుమలు
ఇంకా ఎన్నో ఎన్నెన్నో ..

మన అచ్చ తెనుగు సంక్రాంతి సంబరాలు.
మరువలేని మధురానుభూతులు.
- పవన్ గణేష్
హైదరాబాదు

12-01-2010

8 comments:

Anonymous said...

బాగుందండి పవన్ గారు.

రాజన్

జయ said...

చక్కటి సంక్రాంతి వేళ మంచి కవితని వినిపించారు. బాగుందండి.

Anonymous said...

ఈ సంవత్సరం లొ నే చూసిన మొదటి సంక్రాంతి కవిత.. బాగుందండి..

Padmarpita said...

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

Vasu said...

బావున్నాయి మీ సంక్రాంతి సంబరాలు
మీకు కూడా శుభాకాంక్షలు.

Unknown said...

Kavitha bagundhi

PAVAN GANESH said...
This comment has been removed by the author.
kanna said...

Hi ganesh
Kavithalu bagunnai..
Frequency increase cheyi

Satya