మౌనం-
కొన్ని మాటలకి పునాది.
మరి కొన్నిటికి సమాధి!
తనంత తానుగా
వెళ్ళిపోతుంటుంది మౌనం-
మాటల మధ్యలోకి
మాట్లాడకుండానే !
*****
రివ్వున పోయి
చిరుగాలిని స్పృశించి వెనక్కి వచ్చింది మౌనం -
చాలా చల్లగా వుంది.
హాయిగా ఉంది.
వినోదం-
విషాదం -
రెండు రెక్కలనుకుంటా మౌనానికి-
ఎందులోనైనా అదే శూన్యం౧
******
భూమిలో దాక్కునే విత్తుకి తెలియదు
తానొక సమిధనౌతానని!
విశ్వాన్నేలే వృక్షానికి
ఊపిరి పోస్తోందని!
అందుకే మౌనం గా చూస్తుంటుంది.
లేకుంటే ఎలుగెత్తి
అరిచేది
బయట పడేయ్యమని-
నిర్జీవమైపోయేది
మౌనం లాగే !
**************** మౌనం మరల కొనసాగుతుంది**
Tuesday, May 6, 2008
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
hey em matladuthunnaro koncham ardham ayyettu matladukovacchu kada
Interesting.
You have very nice expression.
But I have some objection to the last stanza. The seed in the ground is playing its role in the re-creation process. Why does it become a "samidha"? Why would it want to resist this?
మీ కవిత బావుంది. ఈ రోజే మీ రెండు "మౌనం" కవితలు చదివా. చాలా లోతుగా ఉన్నాయ్ దానిలోని భావాలు. Good one.
కవిత చదివి మీ అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్. ఇక ' కొత్త పాళీ 'గారి ప్రశ్న గూర్చి ! పుట్టుకతోనే ఎవరూ సమాజం కోసం సమిధగా మారాలని అనుకోరు. సామాజిక పరిస్థితులు వారిని అలా చేసేలా పురికొల్పుతాయి. విత్తు కూడా అంతే దాని సామాజిక పరిస్థితుల వల్ల మొలకగా మారి వృక్షమౌతో౦ది. ఈ ప్రస్థానంలో తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతోంది. అస్తిత్వంలేని జీవితం ఎవరు కోరుకుంటారు? కాబట్టి అస్తిత్వం కోసం మౌనం వీడి మాట లోకి వస్తుందని రాసాను!
Post a Comment